Kakani Govardhan Reddy: జలవనరుల శాఖ అధికారులకు మాజీ మంత్రి కాకాణి తీవ్ర హెచ్చరికలు

Ex Minister Kakani Govardhan Reddy Warns Irrigation Officials
  • జలవనరుల శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న కాకాణి గోవర్థన్ రెడ్డి
  • తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలిపెట్టమని హెచ్చరిక
  • పదవీ విరమణ అయినా ఆస్తులను జప్తు చేసి అవినీతి సొమ్ము కక్కిస్తామన్న కాకాణి
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండతో జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఎస్ఈ దేశీనాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. అధికారులు పదవీ విరమణ చేసినా విడిచి పెట్టమని, వారి లెక్కలన్నీ సరిచేస్తామని పేర్కొన్నారు. వారి ఆస్తులను సైతం అమ్మించి అవినీతి సొమ్ము కక్కిస్తామని కాకాణి హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, వైసీపీ హయాంలో జలవనరుల శాఖలో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవల బయటపెట్టారని, అందుకే కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. 
Kakani Govardhan Reddy
Nellore
Somireddy Chandramohan Reddy
YSRCP
TDP
Irrigation Department
Corruption
Andhra Pradesh Politics

More Telugu News