Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 ఫినాలేలో ఊహించని ట్విస్ట్... టైటిల్ రేసు నుంచి ఇద్దరు ఎలిమినేట్

Bigg Boss Telugu 9 Finale Twist Two Contestants Eliminated
  • బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే
  • టైటిల్ రేసు నుంచి నిష్క్రమించిన సంజన, ఇమ్మాన్యుయేల్
  • ఐదో స్థానంతో సరిపెట్టుకున్న సంజన
  • నాలుగో స్థానంలో నిలిచిన కమెడియన్ ఇమ్మాన్యుయేల్
  • ట్రోఫీ కోసం కల్యాణ్, తనూజ, పవన్ మధ్య పోటీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. టైటిల్ ఫేవరెట్లుగా ప్రచారంలో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఫైనల్ ఈవెంట్‌లో సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించారు.

ఫైనల్‌కు చేరిన ఐదుగురిలో తొలుత సంజన గల్రానీ ఎలిమినేట్ అయ్యారు. బలమైన కంటెస్టెంట్‌గా పేరున్న ఆమె ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. తన ఎలిమినేషన్‌ను ఆమె నమ్మలేకపోయారు. నటుడు శ్రీకాంత్ హౌస్ లోకి వెళ్లి సంజనను బయటికి తీసుకొచ్చారు.  తర్వాత కొద్దిసేపటికే, షో చరిత్రలోనే ఫైనల్‌కు చేరిన తొలి కమెడియన్‌గా రికార్డు సృష్టించిన ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచి హౌస్‌ను వీడారు. ఈ ఫలితంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇమ్మాన్యుయేల్ ను 'అనగనగా ఒక రాజు' జోడీ నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి బయటికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం టైటిల్ పోరులో ముగ్గురు మాత్రమే మిగిలారు. హౌస్‌లోకి అడుగుపెట్టిన కామనర్ కల్యాణ్ పడాల, సీరియల్ నటిగా అభిమానులను సంపాదించుకున్న తనూజ పుట్టస్వామి, అనూహ్యంగా టాప్ 3కి చేరిన డెమోన్ పవన్ మధ్య ట్రోఫీ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ముగ్గురిలో బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఎవరనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
Bigg Boss Telugu 9
Bigg Boss
Telugu reality show
Sanjana Galrani
Immanuel
Kalyan Padala
Tanuja Puttaswamy
Demon Pavan
elimination
grand finale

More Telugu News