Samantha: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద 'సిరిమల్లె శారీస్' షోరూమ్‌ను ప్రారంభించిన హీరోయిన్ సమంత

Samantha Inaugurates Sirimallle Sarees Showroom in Jubilee Hills
  • చీరలు అమ్మాయిలకు మంచి స్నేహితురాళ్లు అని సమంత వ్యాఖ్యలు
  • సిరిమల్లె షోరూమ్ లో చీరల కలెక్షన్ బాగుందని వెల్లడి
  • షోరూమ్ వద్దకు భారీగా తరలివచ్చిన సమంత అభిమానులు 
ప్రముఖ నటి సమంత ఈ రోజు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఫ్యాషన్ ప్రియులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మరియు సమంత అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాళ్లు అని అభివర్ణించారు. ఈ సిరిమల్లె షోరూమ్ లో శారీ కలెక్షన్లు చాలా బాగున్నాయి అని తెలిపారు. 

అంతేకాదు, భారతీయ హస్తకళలు మరియు చేనేత శారీల ప్రాధాన్యతను కూడా సమంత వివరించారు భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు. 

సిరిమల్లె శారీస్ షోరూమ్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ షోరూమ్ ప్రారంభం తమ బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తి పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు మరియు సంప్రదాయాలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉండే ప్రతి కలెక్షన్స్ కస్టమర్ అభిరుచి మేరకు తయారు చేయిస్తామని అన్నారు.
Samantha
Samantha Ruth Prabhu
Sirimallle Sarees
Jubilee Hills
Hyderabad
Saree showroom launch
Indian handlooms
Sarees
Fashion
Soujanya

More Telugu News