Sameer Minhas: అండర్-19 ఆసియా కప్ ఫైనల్... టీమిండియా ముందు కొండంత టార్గెట్
- దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ ఫైనల్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగులు చేసిన పాక్
- 172 పరుగులతో భారీ సెంచరీ చేసిన పాక్ ఓపెనర్ సమీర్
- లక్ష్యఛేదనలో 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఫైనల్ పోరులో భారత్ ముందు పాకిస్థాన్ కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో భారత కుర్రాళ్ల జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అదే పెద్ద పొరపాటు అయింది. భారత బౌలర్లను చీల్చిచెండాడిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో 172 పరుగులతో మాసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడి స్కోరులో 17 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఉస్మాన్ ఖాన్ 35, అహ్మద్ హుస్సేన్ 56 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్ 2, ఖిలన్ పటేల్ 2, కనిష్క్ చౌహాన్ 1 వికెట్ తీశారు.
అనంతరం, 348 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బరిలో దిగిన భారత్ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో చకచకా 26 పరుగులు చేసినా, అలీ రజా బౌలింగ్ లో అవుటయ్యాడు.
అంతకుముందే, కెప్టెన్ ఆయుష్ మాత్రే (3) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన ఆరోన్ జార్జ్ 16, విహాన్ మల్హోత్రా 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం భారత్ స్కోరు 7 ఓవర్లలో 4 వికెట్లకు 59 పరుగులు. భారత్ ఇంకా 43 ఓవర్లలో 289 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి.