YS Jagan Mohan Reddy: జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్
- ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్
- రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులు
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నేతలు జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.