Sajjanar: సజ్జనార్ సంచలన నిర్ణయం... టాస్క్‌ఫోర్స్ పోలీసులకు షాకిచ్చిన సీపీ

Sajjanar Transfers 80 Task Force Personnel Amid Corruption Claims
  • ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సీపీ
  • కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ర్యాంకు అధికారుల అటాచ్
  • కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లో పాతుకుపోయిన అధికారులు
హైదరాబాద్ నగర సీపీ వీ.సీ. సజ్జనార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు షాక్ ఇచ్చారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులపై అవినీతీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ర్యాంక్ అధికారులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లో అధికారులు బదిలీలు లేకుండా ఉన్నారు. ఇటీవలి కాలంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఒక నిందితుడిని తప్పించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Sajjanar
VC Sajjanar
Hyderabad City Police
Task Force Police
Telangana Police
Corruption allegations

More Telugu News