Hardik Pandya: యువీ రికార్డు మిస్సయ్యా.. అయినా సంతోషంగా ఉంది: హార్దిక్ పాండ్యా

Hardik Pandya Missed Record But Happy For Yuvraj Singh
  • భారత్ తరఫున రెండో వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ సాధించిన పాండ్యా
  • యువరాజ్ సింగ్ రికార్డు పదిలంగా ఉండటంపై సంతోషం వ్యక్తం చేసిన ఆల్‌రౌండర్
  • ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికాతో నిన్న అహ్మదాబాద్ లో జరిగిన చివరి టీ20ామ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారత్ తరఫున రెండో వేగవంతమైన టీ20 అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా 38 బంతుల్లో 63 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో గెలిచిన భారత్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం పాండ్యా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశానన్న విషయం అవుటై డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకే తెలిసిందని చెప్పాడు. "ఈ విషయం తెలిసిన వెంటనే అగ్రస్థానాన్ని మిస్సయ్యానే అనిపించింది. కానీ, ఆ రికార్డు ఇప్పటికీ యువరాజ్ సింగ్ పా పేరు మీదే ఉండటం సంతోషంగా ఉంది" అని పాండ్యా అన్నాడు.

తన ఇన్నింగ్స్ గురించి వివరిస్తూ, "ఈ రోజు మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. తొలి బంతికే సిక్స్ కొట్టాలని నా పార్ట్‌నర్‌తో చెప్పాను. పరిస్థితులు నాకు అనుకూలంగా ఉండటంతో రిస్క్ తీసుకున్నాను, అది ఫలించింది" అని తెలిపాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. తనకు అప్పగించిన పాత్ర వికెట్లు తీయడమేనని, అందుకే ఎప్పుడూ దూకుడుగా బౌలింగ్ చేస్తానని చెప్పాడు. మరోవైపు, పాండ్యాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ (73) మాట్లాడుతూ.. హార్దిక్ భాయ్ బ్యాటింగ్ చూడటం గొప్ప అనుభూతినిచ్చిందని అన్నాడు. తాను బౌలింగ్‌పైనా దృష్టి సారిస్తున్నానని, త్వరలోనే బౌలింగ్ కూడా చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Hardik Pandya
India vs Australia
T20 series
Yuvraj Singh
Varun Chakravarthy
Tilak Varma
fastest fifty
cricket record
Indian cricket
player of the match

More Telugu News