Narella Chinnasailu: పంట రుణం చెల్లించేందుకు రూ.2 లక్షలకు పైగా నకిలీ రూ.500 నోట్లు తెచ్చిన రైతు

Farmer Brings Fake Notes to Repay Loan in Nizamabad
  • నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఘటన
  • రుణం చెల్లించేందుకు తెచ్చిన రూ.2,08,500 నకిలీ నోట్లుగా గుర్తించిన బ్యాంకు సిబ్బంది
  • బ్యాంకు సిబ్బంది ప్రశ్నించడంతో పరారైన రైతు
నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండల కేంద్రంలో ఒక వ్యక్తి పంట రుణం చెల్లించడానికి బ్యాంకుకు తెచ్చిన నగదు నకిలీదని బ్యాంకు అధికారులు గుర్తించడంతో ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు నరెడ్ల చిన్నసాయిలు తన పంట రుణం చెల్లించేందుకు గురువారం సాయంత్రం వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకుకు వచ్చాడు. అతడు రూ.2,08,500 రుణం చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తాన్ని రూ.500 నోట్లు రూపంలో తీసుకువచ్చాడు.

క్యాష్ కౌంటర్‌ వద్ద నగదును అందించగా, కౌంటింగ్ యంత్రం ద్వారా లెక్కిస్తుండగా నకిలీ నోట్లు బయటపడ్డాయి. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది మొత్తం నగదును పరిశీలించగా అన్నీ నకిలీ నోట్లుగా తేల్చారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావని బ్యాంకు సిబ్బంది రైతును ప్రశ్నించగా, అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.

బ్యాంకు అధికారులు నాలుగు రూ.500 నోట్ల కట్టలలో ఒక్కొక్క కట్టపై ఒకే రకమైన సీరియల్ నెంబర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారి పంకజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారైన రైతు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Narella Chinnasailu
Nizamabad
fake currency
counterfeit notes
farmer loan
bank fraud

More Telugu News