Donald Trump: భారత్‌తో సంబంధాల కోసం.. కీలకమైన డిఫెన్స్ పాలసీపై ట్రంప్ సంతకం

Donald Trump signs defense policy bill for India relations
  • డిఫెన్స్ పాలసీలో కీలక అంశాలు
  • డిఫెన్స్ రంగంలో భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం
  • స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంత ఉమ్మడి లక్ష్యాల సాధన
  • చైనాతో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందడం
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వార్షిక రక్షణ విధాన బిల్లుపై (డిఫెన్స్ పాలసీ) సంతకం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం సాధించడానికి క్వాడ్ కూటమి ద్వారా భారత్‌తో సంబంధాలను విస్తృతం చేయాలని అమెరికా భావిస్తోంది.

ట్రంప్ సంతకం చేసిన ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్-2026లో భారత్‌‍తో రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, క్వాడ్ కూటమి ద్వారా స్వేచ్ఛాయుతమైన, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంత లక్ష్యాలను సాధించడం, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడం వంటి అంశాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, దేశీయంగా, విదేశాల నుంచి వచ్చే బెదిరింపుల నుంచి దేశాన్ని కాపాడటానికి, రక్షణ పారిశ్రామిక రంగ పునాదులను బలోపేతం చేయడానికి ఈ చట్టం ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. భారత్‌తో రక్షణ రంగంలో మరింత సహకారం ద్వారానే ఇండో-పసిఫిక్‌ రీజియన్ లో చైనాపై ఆధిపత్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

ఈ బిల్లు అమలులోకి వస్తే ఇరు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ వాణిజ్యం, విపత్తుల సమయంలో మానవతా సహాయం, సముద్ర భద్రత వంటి అంశాల్లో సహకారం వంటి ప్రయోజనాలు ఉండనున్నాయి.
Donald Trump
India US relations
defense policy
National Defense Authorization Act

More Telugu News