Nara Lokesh: యువత భవిష్యత్తుపై జగన్‌కు ఎందుకంత ద్వేషం?: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Accuses YS Jagan of Blocking AP Jobs
  • ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోందని లోకేశ్ ఆరోపణ
  • టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలపై పిల్స్ వేస్తున్నారని విమర్శ
  • యువత భవిష్యత్తుపై జగన్‌కు ద్వేషం ఎందుకని సూటి ప్రశ్న
  • ప్రతి అడుగులోనూ రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నారని ట్వీట్‌
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు రాకుండా వైసీపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించే పలు ప్రతిష్ఠాత్మక సంస్థల ప్రాజెక్టులకు వైసీపీ పిల్స్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు) వేస్తూ అడ్డుపడుతోందని మండిపడ్డారు.

టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, రహేజా ఐటీ పార్కుల వంటి కీలక ప్రాజెక్టులను వైసీపీ లక్ష్యంగా చేసుకుందని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్రంలోని యువతకు సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. అయితే, వీటిపై కోర్టుల్లో పిల్స్ వేయడం ద్వారా వైసీపీ వాటిని అడ్డుకుంటోందని ఆరోపించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను లోకేశ్ సూటిగా ప్రశ్నించారు. "వైఎస్ జగన్ గారూ.. మా యువత భవిష్యత్తుపై మీకెందుకంత ద్వేషం? ప్రతి అడుగులో ఏపీని ఎందుకు ఇలా దెబ్బతీస్తున్నారు?" అని తన ట్వీట్‌లో నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిని, యువత ఉపాధిని అడ్డుకోవడం ద్వారా వైసీపీ పైశాచిక ఆనందం పొందుతోందని ఆయన విమర్శించారు. 
Nara Lokesh
YS Jagan
Andhra Pradesh
AP Investments
Job Opportunities
TCS
Cognizant
IT Parks
Public Interest Litigation
AP Development

More Telugu News