Naveen Yadav: జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ తప్ప మరొకరైతే గెలిచేవాళ్లు కాదు: రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే

Naveen Yadav Only Could Win Jubilee Hills Says Rajender Nagar MLA
  • అభ్యర్థిని ఎంపిక చేసిన సమయంలో రేవంత్ రెడ్డి పలువురి అభిప్రాయం తీసుకున్నారని వెల్లడి
  • తనను అడిగితే, నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడని చెప్పానన్న ప్రకాశ్ గౌడ్
  • శ్రీశైలం యాదవ్ సినిమా వాళ్లతో ఎంతో స్నేహంగా ఉండేవారన్న ఎమ్మెల్యే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉండటం వల్లే గెలిచారని, ఆయన కాకుండా వేరే ఎవరైనా పోటీ చేసి ఉంటే ఓడిపోయేవారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురి అభిప్రాయాలు తీసుకున్నారని చెప్పారు.

తనను కూడా రేవంత్ రెడ్డి అడిగితే, "జూబ్లీహిల్స్‌లో ఎవరూ గెలవరు.... నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడు" అని తాను చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి మరికొందరి అభిప్రాయాలు తీసుకుంటే అందరూ అదే చెప్పారని అన్నారు. వాస్తవం చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నవీన్ యాదవ్ ఉండటం వల్లే గెలిచాడని అన్నారు.

జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సహకరించారని ప్రకాశ్ గౌడ్ అన్నారు. శ్రీశైలం యాదవ్ కూడా సినిమా వాళ్లతో ఎంతో స్నేహంగా ఉంటారని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారని అన్నారు. వారంతా నవీన్ యాదవ్‌కు అండగా నిలబడ్డారని ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
Naveen Yadav
Jubilee Hills
Rajender Nagar
Prakash Goud
Revanth Reddy

More Telugu News