Nampally CBI Court: 2 గంటలకు బాంబు పేలుతుంది: నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు

Bomb Threat to Nampally CBI Court Hyderabad
  • గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెసేజ్
  • జడ్జిలు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • బెదిరింపుకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ పోలీసుల యత్నం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులను కోర్టు నుంచి బయటకు పంపించి, బాంబు నిర్వీర్య దళాలతో తనిఖీలు చేపట్టారు.

కోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఈ బెదిరింపు సందేశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Nampally CBI Court
Hyderabad
CBI Court
Bomb threat
Nampally
Cyber police

More Telugu News