Pragathi: రెండో పెళ్లిపై నటి ప్రగతి ఆసక్తికర వ్యాఖ్యలు

Pragathi Actress Comments on Second Marriage
  • తన మెచ్యూరిటీకి సరిపోయే వ్యక్తి దొరకాలన్న నటి
  • ప్రస్తుతం పెళ్లిపై ఆశలు లేవని, పిల్లలే ముఖ్యమని వెల్లడి
  • తన పెళ్లికి కొన్ని కండిషన్లు ఉంటాయని వ్యాఖ్య 
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రగతి, తన రెండో పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో తన ఫిట్‌నెస్, వర్కౌట్ వీడియోలతో నిత్యం వార్తల్లో ఉండే ఆమె, తాజాగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఒకవేళ భవిష్యత్తులో తోడు కావాలనిపిస్తే కొన్ని కండిషన్లు ఉంటాయని కుండబద్దలు కొట్టారు.

ఈ విషయంపై ప్రగతి మాట్లాడుతూ.. "జీవితంలో ఒక తోడు అవసరమే. కానీ, ఎంచుకునే వ్యక్తి నా మెచ్యూరిటీ స్థాయికి తగినట్లుగా ఉండాలి. అలా దొరక్కపోతే జీవితం మళ్లీ కష్టమవుతుంది. పెళ్లయ్యాక ఆంక్షలు, కండిషన్లు పెడితే నేను భరించలేను. అదే నాకు 20 ఏళ్లు ఉంటే సర్దుకుపోయేదాన్నేమో. కానీ ఇప్పుడు నా వయసు, ఆలోచనలు వేరు. కాబట్టి ప్రస్తుతం పెళ్లిపై ఎలాంటి ఆశలు లేవు" అని స్పష్టం చేశారు.

తన పిల్లలే తన ప్రపంచమని, వారిని చూసి గర్వపడుతున్నానని ప్రగతి తెలిపారు. "నా కొడుకు చదువు పూర్తి చేసుకుని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు యూఎస్‌లో చదువుకుంటోంది. సమాజానికి మంచి పిల్లలను అందించానన్న సంతృప్తి నాకుంది. ఇక నేను జీవితంలో పెళ్లి చేసుకోకపోయినా బతకగలను కానీ, వర్కౌట్స్ చేయకుండా మాత్రం ఉండలేను" అని తన ఫిట్‌నెస్ పట్ల ఉన్న ఇష్టాన్ని చాటుకున్నారు. ఇటీవల అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు రజత పతకాలు సాధించి ప్రగతి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
Pragathi
Pragathi actress
Telugu actress Pragathi
Pragathi second marriage
Pragathi fitness
Pragathi workouts
Character artist Pragathi
Pragathi powerlifting
Pragathi interview
Pragathi children

More Telugu News