Manchu Manoj: 'డేవిడ్ రెడ్డి'లో చరణ్, శింబు గెస్ట్ రోల్స్‌పై స్పందించిన మంచు మనోజ్

Manchu Manoj Responds to Charan Simbu Cameo Rumors in David Reddy
షార్ట్స్‌లో చూడండి
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'డేవిడ్ రెడ్డి'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నటుడు శింబు అతిథి పాత్రల్లో కనిపించనున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారానికి మనోజ్ తెరదించారు. ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పటివరకూ ఆ పాత్రల కోసం తాము ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.

హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా 'డేవిడ్ రెడ్డి' తెరకెక్కుతోంది. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు మనోజ్ బదులిస్తూ.. "సినిమాలో అతిథి పాత్రలకు మంచి స్కోప్ ఉంది. కానీ, ఆ పాత్రల కోసం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ వివరాలు నేనే వెల్లడిస్తాను" అని వివరించారు.

ఈ సినిమాలో 'వార్ డాగ్' అనే ప్రత్యేకమైన బైక్ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ తెలిపారు. ప్రభాస్ నటించిన 'కల్కి' చిత్రంలోని 'బుజ్జి' కారును రూపొందించిన బృందమే ఈ బైక్‌ను కూడా తయారు చేసిందని చెప్పారు. సుమారు 700 కేజీల బరువుండే ఈ బైక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన అన్నారు.

మనోజ్ సినీ పరిశ్రమలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టులో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రకటించారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
Go Back to Shorts
Manchu Manoj
David Reddy
Ram Charan
Simbu
Hanuma Reddy Yakkanti
War Dog Bike
Kalki 2898 AD
Telugu cinema
Pan-India movie
Movie Teaser

More Telugu News