Nara Lokesh: ప్రైవేటు విద్యాసంస్థలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త

Nara Lokesh Announces Good News for Private Educational Institutions
  • ప్రైవేట్ విద్యాసంస్థలకు నిబంధనల సడలింపు
  •  ఐదేళ్లకు ఒకసారి ఫైర్ ఎన్‌వోసీ సరిపోతుంది
  •  ఇకపై పదేళ్లకు ఒకసారి స్కూల్స్ రెన్యూవల్
  •  పాదయాత్ర హామీని నెరవేర్చిన మంత్రి లోకేశ్
  •  ఈ మేరకు జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కఠిన నిబంధనలను సడలిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా, ఏటా ఫైర్ సేఫ్టీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలన్న నిబంధనను సవరిస్తూ విద్యాశాఖ జీవో విడుదల చేసింది.

కొత్త ఉత్తర్వుల ప్రకారం, 30 మీటర్ల లోపు ఎత్తు ఉన్న విద్యాసంస్థల భవనాలు ఇకపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఫైర్ ఎన్‌వోసీ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా, పాఠశాలల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ (రెన్యూవల్) గడువును పదేళ్లకు ఒకసారిగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి ఏటా ఎన్‌వోసీ తీసుకోవాలన్న నిబంధన ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, దీన్ని మార్చాలని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి లోకేశ్ ఈ ఫైల్‌పై చర్యలు తీసుకున్నారు.

గత ప్రభుత్వ నిబంధనల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
Nara Lokesh
Andhra Pradesh
Private Educational Institutions
Fire Safety NOC
School Registration Renewal
AP Education Department
TDP Government
Education Policy
YCP Government
Private Schools

More Telugu News