India vs South Africa: భారత్, దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ రద్దు
- అధిక పొగమంచు కారణంగా రద్దయిన మ్యాచ్
- మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు
- మ్యాచ్ నిర్వహణకు వీలు కాకపోవడంతో రద్దు నిర్ణయం
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరగాల్సిన నాలుగవ టీ20 మ్యాచ్ రద్దయింది. అధిక పొగమంచు కారణంగా మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అనంతరం, మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకునేది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిచి ఉంటే సిరీస్ సమం అయ్యేది. నిర్ణయాత్మక ఐదవ టీ20 మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా, పొగమంచు తగ్గుతుందేమోనని రాత్రి 9:30 గంటల వరకు వేచి చూశారు. అంపైర్లు ఐదుసార్లు మైదానాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.