Lionel Messi: మెస్సీకి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Lionel Messi Receives Expensive Watch Gift from Anant Ambani
  • మెస్సీకి రూ.10.9 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే వాచ్ బహుమతి ఇచ్చిన అనంత్ అంబానీ 
  • ప్రపంచవ్యాప్తంగా 12 మాత్రమే ఉన్న ప్రత్యేక ఎడిషన్
  • భారత్ పర్యటనలో భాగంగా వంతారా సందర్శన
  • ఈ అరుదైన వాచ్ పలువురు ప్రముఖుల వద్ద మాత్రమే ఉన్న వైనం
ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన భారత పర్యటనను విజయవంతంగా ముగించాడు. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటించిన ఈ అర్జెంటీనా స్టార్, తన టూర్‌లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 'వంతారా'ను కూడా సందర్శించాడు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ, మెస్సీకి అత్యంత అరుదైన, ఖరీదైన వాచ్‌ను బహుమతిగా అందించారు.

అనంత్ అంబానీ బహూకరించిన ఈ వాచ్ 'రిచర్డ్ మిల్లే RM 003-V2 GMT టూర్‌బిలాన్ ఆసియా ఎడిషన్'. దీని విలువ సుమారు రూ.10.9 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 యూనిట్లు మాత్రమే తయారు చేయబడిన అత్యంత అరుదైన వాచ్‌లలో ఇది ఒకటి. వంతారాకు వచ్చినప్పుడు మెస్సీ చేతికి ఎలాంటి వాచ్ లేదని, తిరిగి వెళ్లేటప్పుడు ఆయన ఈ కొత్త వాచ్ ధరించి కనిపించ‌డం పలువురు గమనించారు.

బిజినెస్ టుడే కథనం ప్రకారం ఈ వాచ్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మాన్యువల్-వైండింగ్ టూర్‌బిలాన్ మూవ్‌మెంట్, డ్యూయల్ టైమ్-జోన్ ఇండికేటర్, పవర్-రిజర్వ్, టార్క్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని కేసును ఏరోస్పేస్, ఫార్ములా 1 రేసింగ్‌లో ఉపయోగించే కార్బన్ టీపీటీ మెటీరియల్‌తో తయారు చేశారు. గురుత్వాకర్షణ ప్రభావాన్ని తట్టుకుని కచ్చితమైన సమయాన్ని చూపేలా టూర్‌బిలాన్ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు.

ప్రపంచవ్యాప్తంగా బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా, ఫార్ములా 1 డ్రైవర్ మిక్ షూమేకర్, ఫెరారీ మాజీ టీమ్ ప్రిన్సిపల్ జీన్ టాడ్ వంటి అతి కొద్దిమంది ప్రముఖుల వద్ద మాత్రమే ఈ ప్రత్యేకమైన వాచ్ ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో లియోనెల్ మెస్సీ కూడా చేరాడు.
Lionel Messi
Anant Ambani
Richard Mille RM 003-V2 GMT
Vantara
Luxury Watch
Rare Watch
Football
Reliance Industries
Tourbillon Watch
Asia Edition

More Telugu News