PM Modi: ఇథియోపియాలో 'వందేమాతరం'.. పులకించిపోయిన ప్రధాని మోదీ.. ఇదిగో వీడియో!

PM Modi thrilled as Vande Mataram echoes in Ethiopia
  • ఇథియోపియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
  • మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన ఇథియోపియా ప్రధాని
  • విందులో 'వందేమాతరం' ఆలపించిన స్థానిక గాయకులు
  • సంతోషం వ్యక్తం చేస్తూ చప్పట్లతో అభినందించిన ప్రధాని
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా ఇథియోపియాలో పర్యటిస్తున్నారు. జోర్డాన్ పర్యటన ముగించుకుని ఇథియోపియా చేరుకున్న ఆయనకు అక్కడ అరుదైన, మర్చిపోలేని స్వాగతం లభించింది. 15 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధానికి గౌరవ సూచకంగా ఇథియోపియా గాయకులు భారత జాతీయ గీతం 'వందేమాతరం' ఆలపించారు. ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్.. ప్రధాని మోదీ గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక గాయకులు 'వందేమాతరం' గీతాన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. తమ దేశానికి వచ్చిన భారత ప్రధానికి ఈ విధంగా స్వాగతం పలికారు. ఈ పరిణామంతో పులకించిపోయిన ప్రధాని మోదీ.. గాయకుల ప్రదర్శనను చప్పట్లతో అభినందించారు.

భారతదేశానికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో విదేశీ గడ్డపై ఈ గీతాన్ని ఆలపించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ అరుదైన ఘట్టం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలిచింది.
PM Modi
Ethiopia
Vande Mataram
Indian National Anthem
Ethiopia India relations
PM Modi Ethiopia visit
Abiy Ahmed
Indian diaspora
Cultural relations
India

More Telugu News