Rishab Shetty: రణ్‌వీర్ వివాదంపై స్పందించిన ‘కాంతార’ హీరో.. ఆ పని చేయొద్దంటూ విజ్ఞప్తి

Rishab Shetty Responds to Ranveer Singh Kantara Controversy
  • ఇటీవల గోవాలో దైవాన్ని అనుకరించి విమర్శలపాలైన రణ్‌వీర్ సింగ్
  • పవిత్రమైన దైవకోల ప్రదర్శనలను అనుకరించవద్దని కోరిన రిషబ్ శెట్టి
  • సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణ చెప్పిన బాలీవుడ్ నటుడు
‘కాంతార’ చిత్రంలోని దైవకోల వంటి పవిత్రమైన సంప్రదాయాలను వేదికలపై అనుకరించడం తనను ఎంతో ఇబ్బంది పెడుతుందని నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అన్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ కార్యక్రమంలో దైవకోలను అనుకరించి విమర్శల పాలైన నేపథ్యంలో రిషబ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

చెన్నైలో జరిగిన ‘బిహైండ్‌వుడ్స్’ ఈవెంట్‌లో రిషబ్ మాట్లాడుతూ.. "సినిమాలో చాలా భాగం నటన కావచ్చు, కానీ దైవానికి సంబంధించిన అంశం చాలా పవిత్రమైనది, సున్నితమైనది. దానిని స్టేజిపై ప్రదర్శించడం లేదా ఎగతాళి చేయడం చేయవద్దని నేను ఎక్కడికి వెళ్లినా అభ్యర్థిస్తున్నాను. అది మాతో భావోద్వేగపరంగా ముడిపడి ఉంది" అని వివరించాడు. ఈ ఆచారాల ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేయడానికే ‘కాంతార: చాప్టర్ 1’లో కూడా ప్రామాణికతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు.

నవంబర్ 30న గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో రణ్‌వీర్ సింగ్ ‘కాంతార’లోని దైవకోల సన్నివేశాన్ని ఉత్సాహంగా అనుకరించారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్షమాపణ చెప్పాడు. "రిషబ్ అద్భుత నటనను ప్రశంసించడమే నా ఉద్దేశం. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి" అని ఆయన పేర్కొన్నాడు.
Rishab Shetty
Kantara
Ranveer Singh
Daivakola
Bollywood
Controversy
Apology
Indian Culture
Film Festival
Behindwoods Event

More Telugu News