Hyper Aadi: అక్రమ సంబంధాలకు కులం లేదు... కానీ పెళ్లికి కావాలా?: హైపర్ ఆది

Hyper Aadi Slams Casteism in Relationships and Honor Killings
  • పరువు హత్యలపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు
  • అక్రమ సంబంధాలకు లేని కులం పెళ్లికి ఎందుకని ప్రశ్న
  • సమస్య వచ్చినప్పుడు కులంవాడు సాయం చేయడని వ్యాఖ్య
  • ప్రేమించుకుంటే పెళ్లి చేయాలి కానీ చంపొద్దని హితవు 
ప్రముఖ కమెడియన్, రచయిత హైపర్ ఆది ఏ విషయం గురించైనా తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. తాజాగా కులం, పరువు హత్యల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధాలకు కులం చూస్తారని, కానీ అక్రమ సంబంధాలకు మాత్రం ఏ కులమైనా పర్వాలేదా? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ కీలక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.

కులం ఫీలింగ్‌ను తాను అస్సలు నమ్మనని ఆది స్పష్టం చేశారు. "సమస్య వచ్చినప్పుడు నీ కులం వాడే రాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన కులం అడిగి ఇంజక్షన్ చేయించుకుంటామా? ప్రాణం పోతుంటే నీళ్లు ఇచ్చేవాడి కులం చూస్తామా?" అని ప్రశ్నించారు. అవసరాన్ని బట్టి కులాన్ని వాడుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరువు హత్యలపై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆది ఘాటుగా స్పందించారు. "సంబంధాలకేమో వారి కులం వాళ్లు కావాలి. కానీ అక్రమ సంబంధాలకు ఏ కులమైనా పర్లేదా? ఇది మనం బయట చూస్తూనే ఉన్నాం" అని వ్యాఖ్యానించారు. మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వారికి పెళ్లి చేయాలని, అబ్బాయికి పోషించే శక్తి ఉంటే అంగీకరించాలని సూచించారు. "ఒకవేళ అబ్బాయికి ఉద్యోగం లేకపోతే, ఉద్యోగం తెచ్చుకోమని చెప్పాలి కానీ ఇద్దరినీ చంపుకుంటే ఏం లాభం? ఒక్క నిమిషం ఆలోచిస్తే సరిపోయేదానికి హత్యలు ఎందుకు?" అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
Hyper Aadi
Hyper Aadi caste
Hyper Aadi comments
Hyper Aadi honor killings
Hyper Aadi youtube podcast
Hyper Aadi social media
Telugu comedian
intercaste marriage
love marriage
Telugu news

More Telugu News