Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. బిడ్డను బిల్డింగ్ పైనుంచి తోసేసిన తల్లి

Mother throws 7 year old daughter off building in Hyderabad
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఏడేళ్ల చిన్నారి 
  • చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రకటించిన వైద్యులు
  • తల్లికి మతిస్థిమితం సరిగా లేదంటున్న కుటుంబ సభ్యులు
హైదరాబాద్‌ లోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల కుమార్తెను కన్నతల్లే బిల్డింగ్ పైనుంచి తోసేసింది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించింది. మల్కాజిగిరి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వసంతపురి కాలనీలో మృతురాలి కుటుంబం 20 ఏళ్లుగా నివాసం ఉంటోంది. చిన్నారి తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి మానసిక సమస్యలతో బాధ పడుతోంది.

ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం తల్లి తన కుమార్తెను మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేసింది. కింద మెట్లపై పడిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ప్రాణాలను నిలబెట్టేందుకు వైద్యులు శ్రమించినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ బాలిక మరణించింది. బాలిక మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. బాలిక తల్లి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.
Hyderabad
Child murder
Mother
Vasanthapuri Colony
Malkajgiri Police
Gandhi Hospital
Mental health
Crime news

More Telugu News