public spitting fine: గాలికి నోట్లో పడ్డ ఆకును రోడ్డుపై ఉమ్మేసినందుకు 30 వేల జరిమానా..!

England Elderly Man Roy Marsh Fined for Spitting Leaf
  • ఇంగ్లాండ్ లోని లింకన్ షైర్ లో 86 ఏళ్ల వృద్ధుడికి చేదు అనుభవం
  • కనీసం వివరణ కూడా వినలేదని వాపోయిన వృద్ధుడు
  • సీనియర్ సిటిజన్లను వేధిస్తున్నారంటూ అధికారులపై స్థానికుల ఫైర్
వైద్యుడి సలహా మేరకు వాకింగ్ కు వెళ్లిన ఓ వృద్ధుడికి చేదు అనుభవం ఎదురైంది. పార్క్ లో నడుస్తుండగా గాలికి ఎగిరొచ్చిన ఓ ఆకు వృద్ధుడి నోట్లో పడింది. వెంటనే ఆయన ఉమ్మేయడం ద్వారా దానిని బయట పారేశారు. ఇది గమనించిన ఇద్దరు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆ వృద్ధుడికి ఏకంగా రూ.30 వేల జరిమానా విధించారు. ఇంగ్లాండ్ లోని లింకన్ షైర్ లో 86 ఏళ్ల వృద్ధుడికి ఎదురైందీ చేదు అనుభవం.. వివరాల్లోకి వెళితే..
 
లింకన్ షైర్ కు చెందిన రాయ్ మార్ష్ (86) ఆస్తమా, హృద్రోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాకింగ్ చేయాలన్న వైద్యుడి సలహా మేరకు సౌత్ పరేడ్ కార్ పార్క్ లో నిత్యం నడకకు వెళుతుండేవాడు. ఒకరోజు వాకింగ్ పూర్తి చేసుకుని అక్కడున్న బెంచీపైన కూర్చున్నపుడు బాగా గాలి వీయడంతో ఓ ఆకు ఎగిరి వచ్చి మార్ష్ నోట్లో పడింది. దీంతో కంగారుపడిన మార్ష్.. వెంటనే దానిని బయటకు ఉమ్మేశారు. ఇది గమనించిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మార్ష్ కు 250 పౌండ్ల జరిమానా విధించారు.

చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం నేరమని, జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. మార్ష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. అంతమొత్తం కట్టలేనని బతిమిలాడగా ఫైన్ ను 150 పౌండ్ల (సుమారు రూ.18 వేలు) కు తగ్గించి బలవంతంగా కట్టించుకున్నారు. ఈ విషయాన్ని మార్ష్ తన కుమార్తెకు చెప్పగా.. ఆమె ఈ సంఘటన మొత్తాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దీంతో లింకన్ షైర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ సిటిజన్లను అధికారులు వేధిస్తున్నారని, తమకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని పలువురు నెటిజన్లు వాపోతున్నారు.
public spitting fine
elderly man fined
enforcement officers
Lincolnshire
England
South Parade car park
asthma patient
heart patient
Roy Marsh
Roy Marsh fine

More Telugu News