Manager: ప్రియురాలి కోసం లీవ్.. ఉద్యోగి నిజాయతీకి మేనేజర్ ఫిదా!

Employee Asks Leave to Spend Time With Girlfriend Manager Approves
  • ప్రియురాలితో గడిపేందుకు సెలవు కోరిన ఉద్యోగి
  • ఉద్యోగి నిజాయతీని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టిన మేనేజర్
  • గతంలో ఇలాంటి వాటికి సిక్ లీవ్ పెట్టేవారని వ్యాఖ్య
  • సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన 
మారుతున్న ఆఫీస్ కల్చర్‌కు అద్దం పట్టే ఘటన ఇది. ఓ ఉద్యోగి తన ప్రియురాలితో సమయం గడిపేందుకు సెలవు కోరుతూ పంపిన ఈమెయిల్‌ను అతడి మేనేజర్ లింక్డ్‌ఇన్‌లో షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఉద్యోగి నిజాయతీని, మేనేజర్ స్పందించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఓ ఉద్యోగి తన మేనేజర్‌కు సెలవు కోసం ఈమెయిల్ పంపాడు. అందులో, "సర్, డిసెంబర్ 16న నాకు సెలవు కావాలి. నా గర్ల్‌ఫ్రెండ్ 17వ తేదీన ఉత్తరాఖండ్‌లోని వాళ్ల సొంత ఊరికి వెళ్తోంది. మళ్లీ జనవరి మొదటి వారం వరకు తిరిగి రాదు. అందుకే ఆమె వెళ్లే ముందు ఆ రోజంతా తనతో గడపాలనుకుంటున్నాను. దయచేసి సెలవు మంజూరు చేయగలరు" అని నిజాయతీగా కోరాడు.

ఈ ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన మేనేజర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "కొంతకాలం క్రితం నా ఇన్‌బాక్స్‌కు ఈ మెయిల్ వచ్చింది. పదేళ్ల క్రితమైతే ఇలాంటి కారణానికి ఉదయం 9:15 గంటలకు 'ఆరోగ్యం బాగాలేదు' అని ఓ మెసేజ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో పారదర్శకంగా ముందుగానే అడిగారు. కాలం మారుతోంది. నిజం చెప్పాలంటే నాకీ కొత్త పద్ధతే నచ్చింది. ప్రేమకు మనం కాదనలేం కదా? లీవ్ అప్రూవ్ చేశాను" అని తన పోస్టులో రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో వేలాది మందిని ఆకట్టుకుంది. ఉద్యోగి నిజాయతీ, మేనేజర్ సానుకూల దృక్పథం కార్యాలయంలో నమ్మకాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తాయని చాలామంది కామెంట్లు చేశారు. అయితే, మరికొందరు మాత్రం వ్యక్తిగత సెలవులకు కారణాలు చెప్పాల్సిన అవసరం ఏముందని ‘పర్సనల్ లీవ్ కావాలి’ అని అడిగితే సరిపోయేదని అభిప్రాయపడ్డారు.  
Manager
Employee leave
Leave request
Uttarakhand
Girlfriend
Office culture
Workplace
LinkedIn
Email
Honesty

More Telugu News