Satya Kumar Yadav: వాజ్‌పేయి స్ఫూర్తితోనే మోదీ ప్రధానిగా ఎదిగారు: సత్యకుమార్
- నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడిన నేత వాజ్‌పేయి అని సత్యకుమార్ కితాబు
- మోదీ పాలనలో దేశంలో పెద్ద ఉగ్రదాడులు లేవని వ్యాఖ్య
- విశాఖ, అమరావతిలో త్వరలో మెట్రో రైలు ప్రాజెక్టులు వస్తాయన్న మంత్రి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకునే ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని పాలిస్తున్నారని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వాజ్‌పేయి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, పాలనా శైలి మోదీకి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. నెల్లూరులో జరిగిన 'అటల్ మోదీ సుపరిపాలన యాత్ర' సభలో ఆయన ప్రసంగించారు.
వాజ్‌పేయిని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన గొప్పతనాన్ని అర్థంచేసుకున్నానని సత్యకుమార్ చెప్పారు. 63 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా, బీజేపీ కేవలం రెండు సీట్లు గెలిచినప్పుడు కూడా ఆయన మనోస్థైర్యం కోల్పోలేదని గుర్తుచేశారు. "అపజయాన్ని అంగీకరించను, కాలం రాసిన రాతను మారుస్తా" అంటూ కవిత్వం ద్వారా ఆయన చూపిన ఆత్మవిశ్వాసమే బీజేపీకి కొత్త మార్గం వేసిందని తెలిపారు.
వాజ్‌పేయి వేసిన బాటలోనే నరేంద్ర మోదీ వంటి ఎందరో నేతలు ఎదిగారని, ఆయన స్ఫూర్తితోనే మోడీ దేశ ప్రధాని అయ్యారని సత్యకుమార్ కొనియాడారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే విశాఖపట్నం, అమరావతిలో మెట్రో రైలు ప్రాజెక్టులు రానున్నాయని మంత్రి ప్రకటించారు.
రక్షణ, వ్యవసాయ రంగాల్లో వాజ్‌పేయి నాటిన విత్తనాలే నేడు ఫలాలు ఇస్తున్నాయని చెప్పారు. పాకిస్థాన్‌కు స్నేహహస్తం అందించినా కుట్రలు ఆపకపోవడంతో సమరానికి సిద్ధమై బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. గడచిన 11 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో ఒక్క పెద్ద ఉగ్రదాడి కూడా జరగలేదని, సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ తన సత్తా చాటిందని తెలిపారు.