Chandrababu Naidu: ‘ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- ప్రముఖ జర్నలిస్టు ఐ. వెంకట్రావు రాసిన పుస్తకం
- 'ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్'ను విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- తెలుగులో 'విలీనం - విభజన' పేరుతో ఎన్. అనురాధ అనువాదం
- చరిత్ర పరిశోధకులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగమన్న ముఖ్యమంత్రి
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఐ. వెంకట్రావు రచించిన 'ఎ టేల్ ఆఫ్ టూ స్టేట్స్' పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఎన్. అనురాధ 'విలీనం - విభజన' పేరుతో తెలుగులోకి అనువదించారు.
ఈ పుస్తకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విలీనం నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోయే వరకు జరిగిన కీలక పరిణామాలను రచయిత పొందుపరిచారు. రెండు రాష్ట్రాలను పాలించిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలోని విశేషాలను ఇందులో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రశంసించారు.
చారిత్రక అంశాలతో కూడిన ఇలాంటి పుస్తకాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పుస్తకాన్ని చక్కగా తెలుగులోకి అనువదించిన అనురాధను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రచయిత వెంకట్రావు, అనువాదకురాలు అనురాధ పాల్గొన్నారు.