Nandu: బాలయ్యకు ఎదురెళ్లడమా...? అందుకే మా సినిమాను వాయిదా వేశాం: నందు

Nandu on Postponing Movie Due to Balakrishna Akhanda 2 Release
  • బాలకృష్ణ 'అఖండ 2' కోసం తన సినిమాను వాయిదా వేసిన నందు
  • బాలయ్యకు ఎదురెళ్లినా, ఆయన ఎదురొచ్చినా రిస్కేనని సరదా వ్యాఖ్య
  • సినిమా టికెట్ ధరల నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న శివాజీ
  • డిసెంబర్ 25న 'దండోరా' చిత్రం విడుదల
  • 'దండోరా' టైటిల్ సాంగ్ విడుదల కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు
"బాలకృష్ణకు ఎవరైనా ఎదురెళ్లినా, లేదా ఆయనే ఎవరికైనా ఎదురొచ్చినా.. రిస్క్ మాత్రం వాళ్లకే" అని నటుడు నందు సరదాగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ 2' విడుదల కారణంగా తన 'సైకో సిద్ధార్థ్' సినిమాను వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. నందు, శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా' సినిమా టైటిల్ సాంగ్ విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. డిసెంబర్ 12న బాలయ్య 'అఖండ 2' వస్తుందని తెలియగానే, రానా, సురేశ్ బాబు పిలిచి 'బాలయ్య సినిమా వస్తుంటే మనం పక్కకు వెళ్లాలని సూచించారు. ఆయనపై గౌరవంతోనే మా సినిమాను వాయిదా వేశామని చెప్పారు. ఈ విషయం తెలిసి బాలయ్య ఫ్యాన్స్ మాకు ఎంతో సపోర్ట్ చేశారని, మమ్మల్ని థియేటర్‌కు తీసుకెళ్లి 'అఖండ 2' చూపించారన్నారు. త్వరలోనే బాలయ్యను కలుస్తానని నందు అన్నారు.

ఇదే కార్యక్రమంలో నటుడు శివాజీ సినిమా టికెట్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడికి టికెట్ ధరలు అందుబాటులో ఉండాలన్నారు. మల్టీప్లెక్స్‌లో కాఫీ రూ.350కి అమ్ముతున్నారని, ఈ రేట్లు చూసి ప్రేక్షకులు భయపడుతున్నారన్నారు. ఇది నిర్మాతల సమస్య కాదు, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులు కూడా ఇదే చెబుతున్నాయని శివాజీ పేర్కొన్నారు. 
Nandu
Nandu actor
Akhanda 2
Balakrishna
Dandora movie
Telugu cinema
Tollywood
Movie release date
Shiva Ji actor
Ticket prices

More Telugu News