Revanth Reddy: వచ్చీరావడంతోనే గోల్ చేసిన రేవంత్ రెడ్డి... మెస్సీ రెండు గోల్స్

Revanth Reddy Scores Goal with Messi in Friendly Match
  • ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి, మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్
  • ఇరుజట్లతో ఫొటోలు దిగిన రేవంత్ రెడ్డి, మెస్సీ
  • స్టేడియంలో తిరుగుతూ అభివాదం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్ చేశారు. అదే మ్యాచ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కూడా రెండు గోల్స్ సాధించారు. గోట్ కప్ పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా మెస్సీ, రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున లియోనల్ మెస్సీ ఆడారు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో వీరిద్దరూ బరిలో దిగారు. రేవంత్ రెడ్డి వచ్చీ రావడంతోనే గోల్ కొట్టి అలరించారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి రేవంత్ రెడ్డి, మెస్సీ ఫొటోలు దిగారు. ఇద్దరూ స్టేడియంలో కలియతిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించారు.
Revanth Reddy
Lionel Messi
Telangana
Hyderabad
Friendly Match
GOAT Cup

More Telugu News