Chandrababu Naidu: ఏపీలో నూతన కానిస్టేబుళ్లకు ఈ నెల 16న నియామక పత్రాలు.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Distribute Constable Appointment Letters on 16th
  • కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
  • ఈ నెల 16న అపాయింట్‌మెంట్ లెటర్లు
  • మంగళగిరిలో కార్యక్రమం... పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత
  • అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యేలా ఏర్పాట్లు
రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఈ నెల 16వ తేదీన వారికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. డీఐజీ ఏసుబాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబుతో కలిసి ఆమె ఏర్పాట్లను పర్యవేక్షించి, పలు సూచనలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
Chandrababu Naidu
AP Police
Andhra Pradesh Police
Constable Jobs
Vangalapudi Anitha
APSP 6th Battalion
Mangalagiri
Police Recruitment
AP Government

More Telugu News