Akhanda 2: అఖండ 2 తాండవం: శివుడి పాత్రలో మెప్పించిన ఆ నటుడు ఎవరో తెలుసా?

Tarun Khanna as Lord Shiva in Akhanda 2 Tandavam
  • బాలయ్య 'అఖండ 2' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన
  • సినిమాలో కీలకమైన శివుడి పాత్రపై సర్వత్రా ఆసక్తి
  • పరమేశ్వరుడి పాత్రలో కనిపించిన బాలీవుడ్ నటుడు తరుణ్ ఖన్నా
  • పలు హిందీ సీరియల్స్‌లో శివుడిగా తరుణ్‌కు మంచి గుర్తింపు
  • బాలయ్య, తరుణ్ ఖన్నా తాండవం సీన్‌కు అద్భుతమైన రెస్పాన్స్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ'కు కొనసాగింపుగా రూపొందిన ‘అఖండ 2: తాండవం’ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలయ్య అఘోరా గెటప్‌, శక్తిమంతమైన సంభాషణలకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండగా, ఈ సినిమాలో ఒక కీలకమైన సర్ప్రైజ్ పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినిమాలో పరమేశ్వరుడి పాత్రలో కనిపించి మెప్పించిన ఆ నటుడు బాలీవుడ్ బుల్లితెర నటుడు తరుణ్ ఖన్నా.

‘అఖండ’ మొదటి భాగంలో శివుడి తత్వం ప్రతీకాత్మకంగా ఉంటే, ఈ సీక్వెల్‌లో ఆ భావనను మరింత ముందుకు తీసుకెళ్లారు బోయపాటి. కథలో కీలకమైన ఒక ఎమోషనల్ సన్నివేశంలో శివుడే స్వయంగా భూమిపైకి వస్తాడు. అఖండ తల్లి అంత్యక్రియల సమయంలో, కైలాసం నుంచి వచ్చిన పరమశివుడు ఆమె చితికి నిప్పు అంటించే ఘట్టాన్ని బోయపాటి అత్యంత భక్తిశ్రద్ధలతో, గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఈ పాత్రలో తరుణ్ ఖన్నా అద్భుతంగా ఒదిగిపోయారు. హిందీలో ‘సంతోషి మా’, ‘కర్మఫల్ దాత శని’, ‘పరమావతార్ శ్రీ కృష్ణ’ వంటి అనేక పౌరాణిక సీరియల్స్‌లో ఆయన శివుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ అనుభవంతో ‘అఖండ 2’లో శివుడిగా ఎంతో గంభీరంగా కనిపించారు. క్లైమాక్స్‌లో బాలకృష్ణతో కలిసి తరుణ్ ఖన్నా తాండవం చేసే సన్నివేశం ప్రేక్షకులకు గగుర్పాటు తెప్పిస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులకు శివుడిగా సుపరిచితుడైన తరుణ్‌ను ఈ పాత్రకు ఎంపిక చేయడం సినిమా పాన్ ఇండియా అప్పీల్‌కు కూడా దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Akhanda 2
Tarun Khanna
Nandamuri Balakrishna
Boyapati Srinu
Lord Shiva
Bollywood actor
Mythological series
Telugu cinema
Akhanda movie
Pan India appeal

More Telugu News