Dare to Play: వచ్చేసింది 'లేడీ వయాగ్రా'.. 10 నిమిషాల్లోనే ప్రభావం చూపే క్రీమ్!

Viagra Alternative For Women Launched In US Works In 10 Minutes
  • మహిళల కోసం 'వయాగ్రా' తరహా క్రీమ్‌ను అభివృద్ధి చేసిన అమెరికా సంస్థ
  • 'డేర్ టు ప్లే' పేరుతో వస్తున్న ఈ క్రీమ్ 10 నిమిషాల్లోనే ప్రభావం
  • వయాగ్రాలో ఉండే 'సిల్డెనాఫిల్' దీనిలోనూ కీలకమైన పదార్థం
  • క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేవని వెల్లడి
పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచే 'వయాగ్రా' అందుబాటులోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నాళ్లకు మహిళల కోసం కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఉత్పత్తిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాకు చెందిన 'డేర్ బయోసైన్స్' అనే సంస్థ మహిళల్లో లైంగిక ప్రేరేపణను పెంచే ఒక ప్రత్యేకమైన క్రీమ్‌ను తయారు చేసింది. 'డేర్ టు ప్లే' పేరుతో వస్తున్న ఈ క్రీమ్ కేవలం 10 నిమిషాల్లోనే ప్రభావం చూపుతుందని సంస్థ చెబుతోంది.

ఈ క్రీమ్‌లో వయాగ్రాలో ఉపయోగించే 'సిల్డెనాఫిల్' అనే రసాయనాన్నే వాడారు. దీన్ని ప్రైవేట్ భాగాల్లో రాసుకోవడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి, స్పర్శ జ్ఞానం, లైంగిక వాంఛ మెరుగుపడతాయని తయారీదారులు చెబుతున్నారు. "మహిళల శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందిస్తే సిల్డెనాఫిల్ అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపించాం. 1998లో వయాగ్రా పురుషుల లైంగిక వైద్యంలో విప్లవం సృష్టించింది. కానీ మహిళల విషయంలో దాదాపు 30 ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేదు" అని డేర్ బయోసైన్స్ సీఈఓ సబ్రినా మార్టుక్కీ జాన్సన్ తెలిపారు.

ఈ ఉత్పత్తి భద్రత, సామర్థ్యాన్ని పలు క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిర్ధారించుకున్నామని, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని కంపెనీ పేర్కొంది. సుమారు 200 మంది మహిళలపై జరిపిన ప్రయోగాల్లో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే వారిలో లైంగిక ఆసక్తి, కోరికలు, భావప్రాప్తి వంటివి గణనీయంగా పెరిగినట్లు తేలింది.

పురుషులకు ఉన్నట్లుగా మహిళలకు పిల్ ఎందుకు తయారు చేయలేదన్న ప్రశ్నకు, దానికి చాలా ఎక్కువ మోతాదులో సిల్డెనాఫిల్ అవసరమవుతుందని, అది ఆచరణ సాధ్యం కాదని జాన్సన్ వివరించారు. ప్రస్తుతం అమెరికాలోని 10 రాష్ట్రాల్లో ఈ క్రీమ్ కోసం ప్రీ-ఆర్డర్లు స్వీకరిస్తుండగా, 2026 ప్రారంభం నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Dare to Play
Dare Bioscience
Lady Viagra
Female Viagra
Sildenafil
Sexual dysfunction
Women's health
FDA approval
Sexual arousal
Female sexual enhancement

More Telugu News