Akhanda 2: కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. 'అఖండ 2' టికెట్ల అమ్మకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్

High Court Questions Akhanda 2 Ticket Sales After Order
  • 'అఖండ-2' టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
  • ప్రభుత్వ మెమోను సస్పెండ్ చేసినా అధిక ధరలకు అమ్ముతున్నారంటూ పిటిషన్
  • కోర్టు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారన్న బుక్‌మైషో 
  • ఇప్పుడు కూడా పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారా? లేదా? అని నిలదీసిన కోర్టు
  • తదుపరి విచారణ మధ్యాహ్నానికి వాయిదా
'అఖండ-2' సినిమా టికెట్ల ధరల వివాదంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ పెంచిన ధరలకే టికెట్లు అమ్మడంపై చిత్ర నిర్మాతలు, ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ బుక్‌మైషోను తీవ్రంగా హెచ్చరించింది. "కోర్టు ఉత్తర్వులు అంటే మీకు లెక్క లేదా?" అని ఘాటుగా ప్రశ్నించింది.

వివరాల్లోకి వెళితే.. 'అఖండ-2' సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న సస్పెండ్ చేసింది. అయినప్పటికీ, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిన్న రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించారని, అధిక ధరలకే టికెట్లు విక్రయించారని ఆరోపిస్తూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. తమకు కోర్టు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్‌మైషో తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. అయితే, ప్రస్తుతం కూడా పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారా? లేదా? అని కోర్టు నిలదీసింది. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
Akhanda 2
Akhanda 2 movie
Telangana High Court
BookMyShow
ticket prices
court orders
contempt of court
Vijay Gopal
movie tickets

More Telugu News