Nandamuri Balakrishna: 'అఖండ 3' కూడా వచ్చేస్తోంది.. టైటిల్ ఇదే.. మూడో భాగంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం!

Akhanda 3 Jai Akhanda Title Confirmed
  • ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలకృష్ణ 'అఖండ 2'
  • థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి
  • సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'అఖండ 2' హ్యాష్‌ట్యాగ్
  • సినిమా చివర్లో 'అఖండ 3'పై చిత్రబృందం ప్రకటన
  • 'జై అఖండ' పేరుతో రానున్న మూడో భాగం
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'అఖండ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, వాటికి ఏమాత్రం తగ్గకుండా ఉందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకుని సందడి చేస్తున్నారు. సినిమాలోని బాలయ్య నటన, డైలాగ్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ‘అఖండ 2’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇక సినిమా చూసిన అభిమానులకు చిత్రబృందం చివర్లో ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో మూడో భాగం కూడా రాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. ‘జై అఖండ’ పేరుతో ‘అఖండ 3’ ఉంటుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం రెట్టింపు అయింది. దీంతో బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో మరో పవర్‌ఫుల్ సినిమా రావడం ఖాయమైపోయింది.
Nandamuri Balakrishna
Akhanda 2
Akhanda Movie
Boyapati Srinu
Jai Akhanda
Akhanda 3
Telugu Cinema
Tollywood
Movie Review
Film Sequel

More Telugu News