Chandrababu: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Andhra Pradesh CM Chandrababu Responds to Alluri Bus Tragedy
  • అల్లూరి జిల్లాలో లోయలో పడిన యాత్రికుల బస్సు
  • ప్రమాదంలో 8 మంది మృతి, 20 మందికి తీవ్రగాయాలు
  • భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఘటన
  • సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్డుపై శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యాత్రికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. గాయపడిన వారిని వెంటనే చింతూరు ఆసుపత్రికి తరలించామని, వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
Chandrababu
Alluri bus accident
Andhra Pradesh accident
Chinturu bus accident
Tulasi Pakala ghat road
Road accident India
Bus accident victims
Andhra Pradesh news
Bhadrachalam
Annavaram

More Telugu News