Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో కాగ్ కార్యాలయం
- అమరావతిలో కాగ్ కార్యాలయ భవనానికి కేంద్రం ఆమోదం
- రాజధాని అభివృద్ధిలో ఇది కీలక అడుగన్న కేంద్ర మంత్రి పెమ్మసాని
- తన విజ్ఞప్తి మేరకు అనుమతులు లభించాయన్న పెమ్మసాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2.05 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అమరావతిని పూర్తిస్థాయి, శక్తిమంతమైన పాలనా కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఇది ఒక బలమైన అడుగు అని కేంద్రమంత్రి 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. తన అభ్యర్థన మేరకు ఈ అనుమతులు లభించాయని ఆయన అన్నారు.