Rajasekhar: షూటింగ్‌లో నటుడు రాజశేఖర్‌కు ప్రమాదం

Rajasekhar Injured During Shooting of Telugu Movie
  • తమిళ రీమేక్ షూటింగ్‌లో గాయపడ్డ రాజశేఖర్
  • నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచన
  • జనవరికి వాయిదా పడిన కొత్త సినిమా చిత్రీకరణ
ప్రముఖ నటుడు రాజశేఖర్ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఓ తమిళ రీమేక్ చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది.

వివరాల్లోకి వెళితే, రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన 'లబ్బర్ పందు' రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన కాలి చీలమండకు గాయమైంది. పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. అనంతరం నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

రాజశేఖర్‌కు గాయం కావడంతో సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్రీకరణను తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా, రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్‌గా కనిపించనుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ ఈ సినిమాలో రాజశేఖర్‌కు జోడీగా నటిస్తుండటం విశేషం.

గత కొంతకాలంగా హీరోగా నటిస్తూనే, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ వంటి చిత్రాల్లో సహాయ పాత్రలతోనూ రాజశేఖర్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Rajasekhar
Rajasekhar injury
Lubber Pandu remake
Vishva Dev Rachakonda
Shivani Rajasekhar
Ramya Krishna
Telugu movie shooting
movie accident
Dr Rajasekhar health

More Telugu News