DK Shivakumar: బెంగళూరు తర్వాత ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ గణనీయ వాటాను కలిగి ఉంది: డీకే శివకుమార్

DK Shivakumar Says Telangana Has Significant Share in IT Exports After Bangalore
  • బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందన్న డీకే శివకుమార్
  • ఈ రెండు మహా నగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని వ్యాఖ్య
  • తెలంగాణ అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని హామీ
దేశీయ ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు 40 శాతం వాటా కలిగి ఉండగా, చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ కూడా గొప్ప వాటాను కలిగి ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో ఆయన ప్రసంగించారు.

అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందని డీకే శివకుమార్ అన్నారు. ఈ రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరానికి ఏం కావాలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసిందని ఆయన ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్రం, దక్షిణ భారతదేశ అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం కూడా గణనీయమైన వాటాను కలిగి ఉందని అన్నారు. కాలిఫోర్నియా వంటి ప్రపంచస్థాయి నగరాల్లో 13 లక్షల మంది భారతీయ ఇంజినీర్లు పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి మరింత దృఢంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో తాను ఈ సదస్సుకు వచ్చానని ఆయన పేర్కొన్నారు.
DK Shivakumar
Telangana
Karnataka
IT Exports
Bangalore
Hyderabad
Future City

More Telugu News