Amrapali IAS: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు

Amrapali IAS faces setback in Telangana High Court
  • తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే
  • ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్‌లో డీవోపీటీ ఉత్తర్వులు
  • క్యాట్‌లో సవాల్ చేయడంతో అమ్రపాలికి అనుకూలంగా ఉత్తర్వులు
  • క్యాట్ ఉత్తర్వులను హైకోర్టులో అప్పీల్ చేసిన డీవోపీటీ
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ అక్టోబరులో డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఆమె క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.

క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై డీవోపీటీ హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
Amrapali IAS
Amrapali
Telangana High Court
IAS officer
CAT
DOPT
Andhra Pradesh

More Telugu News