Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత జెమీమా రోడ్రిగ్స్ తొలి స్పందన

Smriti Mandhana Wedding Called Off Jemimah Rodrigues Response
  • సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో పెళ్లిని రద్దు చేసుకున్న స్మృతి మంధాన
  • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించిన భారత క్రికెటర్
  • స్మృతికి అండగా నిలిచిన సహచర క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్
భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన పెళ్లిని రద్దు చేసుకుంది. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సిన వివాహానికి ముగింపు పలుకుతున్నట్లు నిన్న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజులుగా వీరి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది.

నవంబర్ 23న స్మృతి, పలాశ్‌ల వివాహం జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో వేడుకను నిలిపివేశారు. ఆ తర్వాత, ఒత్తిడి సంబంధిత ఆరోగ్య కారణాలతో పలాశ్ కూడా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా స్మృతి పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది.

ఈ క్లిష్ట సమయంలో స్మృతికి ఆమె స్నేహితురాలు, సహచర క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ అండగా నిలిచింది. గతంలో పెళ్లి వాయిదా పడినప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న విమెన్స్ బిగ్ బాష్ లీగ్‌ను మధ్యలోనే వదిలి స్మృతి కోసం జెమీమా భారత్‌కు వచ్చారు. ఇప్పుడు పెళ్లి రద్దు ప్రకటన తర్వాత, జెమీమా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టడంతో పాటు పలాశ్‌ను అన్‌ఫాలో చేసింది.

జెమీమా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొంతమంది యువ గాయకులు ప్రముఖ సింగర్ ఒలివియా డీన్ పాడిన 'మ్యాన్ ఐ నీడ్' అనే పాటను పాడుతున్న ఒక వీడియోను షేర్ చేసింది. అయితే, అభిమానుల దృష్టి మొత్తం ఆ పాటలోని కొన్ని కీలకమైన లైన్ల మీద పడింది.

"కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందుతున్నట్టుగా ఉంది.. నువ్వు నాకు విడమరిచి చెప్పాలి" అనే లోతైన భావం ఉన్న వాక్యాలు ఆ పాటలో ఉన్నాయి. ఈ ఎమోషనల్ లైన్లు ఉన్న వీడియోను జెమీమా పంచుకోవడంతో, ఆమె ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమై ఉంటుందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Smriti Mandhana
Indian women cricket
Jemimah Rodrigues
Palash Muchhal
cricket star
wedding cancelled
Womens Big Bash League
Olivia Dean
Man I Need song
singer

More Telugu News