Ramdher: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. రూ.3 కోట్ల రివార్డున్న కమాండర్ లొంగుబాటు

Maoist Commander Ramdher Surrenders with Reward of 3 Crores
  • ఛత్తీస్‌గఢ్‌లో 11 మంది మావోయిస్టుల లొంగుబాటు
  • రూ.3 కోట్ల రివార్డు ఉన్న మావోయిస్టు నేత రాంధెర్‌ లొంగుబాటు
  • ఎంఎంసీ జోన్ బాధ్యతలు చూస్తున్న రాంధెర్‌
మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో 11 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, రూ.3 కోట్ల రివార్డు ఉన్న కీలక నేత రాంధెర్‌ కూడా ఉండటం గమనార్హం.

రాంధెర్‌ చాలాకాలంగా ఎంఎంసీ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌) జోన్‌లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మిళింద్‌ తెల్టుంబే మరణించిన తర్వాత ఆయన ఎంఎంసీ బాధ్యతలను స్వీకరించారు. ఈ జోన్‌లో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న రాంధెర్‌ లొంగుబాటును పోలీసులు కీలక విజయంగా పరిగణిస్తున్నారు.

తాజాగా రాంధెర్‌ లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు దాదాపుగా నక్సల్స్‌ రహితంగా మారాయని అధికారులు భావిస్తున్నారు. ఇది భద్రతా బలగాలకు వ్యూహాత్మకంగా ఎంతో మేలు చేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్న విషయం తెలిసిందే.
Ramdher
Chhattisgarh
Maoists
Surrender
Naxalites
MMC Zone
Maharashtra
Madhya Pradesh
Milind Teltumbde
Anti Naxal Operations

More Telugu News