Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లు అరెస్ట్

Vallabhaneni Vamsi Follower Komma Kotlu Arrested
  • సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న కోట్లు
  • గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ ప్రమేయం
  • కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కోట్లును పట్టుకున్న పోలీసులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడైన కొమ్మా కోట్లును పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న కోట్లు, గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

కోట్లు ఆచూకీపై పక్కా సమాచారం అందుకున్న పటమట పోలీసులు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అతడిని అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసిన వ్యవహారంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోట్లు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు కీలక కేసుల్లో అతని పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం కోట్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇవాళ అరెస్టును అధికారికంగా నమోదు చేసి, కేసుల వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఇదే కిడ్నాప్ కేసులో గతంలో వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ కావడం, అనారోగ్య కారణాలతో జైలులో ఇబ్బందులు ఎదుర్కొని, ఆ తర్వాత విడుదల కావడం తెలిసిందే.  
Vallabhaneni Vamsi
Komma Kotlu
Gannavaram
Satya Vardhan Kidnap Case
TDP Office Attack
YCP Leader
Andhra Pradesh Crime
Patamata Police
Arrest

More Telugu News