chicken piece: గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క.. ఊపిరాడక ఆటో డ్రైవర్ మృతి

Auto Driver Pati Surender Chokes to Death on Chicken
––
కోడి కూరతో అన్నం తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు.. గ్రామానికి చెందిన పాటి సురేందర్ (42) ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం కావడంతో సురేందర్ చికెన్ తీసుకొచ్చి వండమని చెప్పి ఇంట్లో ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చికెన్ కర్రీతో తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో సురేందర్ ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు.

చేతితో తీసేందుకు ప్రయత్నించినా రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సురేందర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. కాగా, సురేందర్ కు భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆటో డ్రైవర్ గా సురేందర్ సంపాదనతోనే కుటుంబం గడుపుతున్నామని, కుటుంబ పెద్దను కోల్పోవడంతో తమకు దిక్కులేకుండా పోయిందని మృతుడి భార్యాపిల్లలు వాపోతున్నారు.
chicken piece
choked
auto driver
Pati Surender
Gollapalli
Yellareddypet
Telangana
death
food choking

More Telugu News