Kakani Govardhan Reddy: సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు

Kakani Govardhan Reddy Faces Case for Inappropriate Comments on Somireddy
  • సోమిరెడ్డిపై పరుష వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు
  • నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు మాయం
  • 2014 నాటి కేసు దర్యాప్తు నీరుగార్చేందుకే ఈ చర్యలని అనుమానాలు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.

ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. కేసును నీరుగార్చేందుకే కీలక ఫైళ్లను ఉద్దేశపూర్వకంగా మాయం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
Kakani Govardhan Reddy
Somireddy Chandramohan Reddy
Andhra Pradesh Politics
Fake Liquor Case
Venkataachalam Police Station
Rami Reddy
YSRCP
Sarvepalli MLA
Chavatapalem Society
File Missing Case

More Telugu News