Virat Kohli: రెండేళ్లుగా ఇంత ఫ్రీగా ఎప్పుడూ ఆడలేదు.. సిరీస్ విజయంపై విరాట్ కోహ్లీ

Virat Kohli Feels Free After Series Win Against South Africa
  • సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న భారత్
  • మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం
  • యశస్వి జైస్వాల్ సెంచరీ.. రోహిత్, కోహ్లీ అర్ధశతకాలు
  • 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌'గా నిలిచిన విరాట్ కోహ్లీ
  • తన బ్యాటింగ్‌పై పూర్తి సంతృప్తిగా ఉన్నానన్న విరాట్
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. సఫారీ జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 39.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (116*) అజేయ శతకంతో కదం తొక్కగా, కెప్టెన్ రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65*) అర్ధశతకాలతో రాణించారు.

ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. ఇక విరాట్ కోహ్లీ 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో వేగంగా ఆడి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.

అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. "నిజాయితీగా చెప్పాలంటే ఈ సిరీస్‌లో నా బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. గడిచిన 2-3 ఏళ్లలో ఎప్పుడూ ఇంత స్వేచ్ఛగా ఆడినట్లు అనిపించలేదు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను మన వైపు తిప్పగలననే ఆత్మవిశ్వాసం నాకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లు మనలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తాయి. సిరీస్ 1-1తో సమమైనప్పుడు, జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నేను, రోహిత్ అనుకున్నాం. ఇప్పుడు జట్టు విజయంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది" అని వివరించాడు.
Virat Kohli
India vs South Africa
Yashasvi Jaiswal
Rohit Sharma
India win
ODI series
cricket
player of the series
century
Indian cricket team

More Telugu News