Nara Lokesh: డాలస్ చేరుకున్న మంత్రి నారా లోకేశ్.. ఘన స్వాగతం

Nara Lokesh Arrives in Dallas Receives Grand Welcome
    
డాలస్ చేరుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కడి తెలుగు ప్రవాసాంధ్రులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా లోకేశ్ పర్యటన సాగనుంది. డాలస్‌లో లోకేశ్ నేడు తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రేపు, ఎల్లుండి శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్ సహా పలు ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. 10న కెనడాలోని టొరంటోలో ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అదేరోజు రాత్రి కెనడా నుంచి బయల్దేరి హైదరాబాద్‌ చేరుకుంటారు. 11న ఉదయం హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లి సీఎం చంద్రబాబుతో కలిసి కాగ్నిజెంట్‌ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
Nara Lokesh
Dallas
Telugu Diaspora
Andhra Pradesh investments
IT sector
Google
San Francisco
Cognizant
Canada
Toronto

More Telugu News