Tennessee: ఇంట్లో పెంచుకున్న కుక్కలే ప్రాణాలు తీశాయి... తాత, మనవరాలిని చంపేసిన పిట్ బుల్స్!

Tennessee Pitbull Attack Seven Dogs Kill Man and Grandchild
  • పెంపుడు పిట్ బుల్స్ దాడిలో తాత, 3 నెలల మనవరాలు మృతి
  • అమెరికాలోని టెన్నెస్సీలో దారుణ ఘటన
  • బాధితులను కాపాడేందుకు ఏడు కుక్కలను కాల్చి చంపిన పోలీసులు
  • ఆ కుక్కలకు దూకుడు స్వభావం ఉందని స్థానికుల వెల్లడి
అమెరికాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. సొంత ఇంట్లోనే ఏడు పెంపుడు పిట్ బుల్ కుక్కలు దాడి చేయడంతో 50 ఏళ్ల వ్యక్తి, అతని 3 నెలల మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. టెన్నెస్సీ రాష్ట్రంలోని టుల్లాహోమాలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
జేమ్స్ అలెగ్జాండర్ స్మిత్ (50), అతని మనవరాలు ఇంట్లో ఉన్న సమయంలో కుటుంబానికి చెందిన ఏడు పిట్ బుల్స్ ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి, స్మిత్ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. పసికందుపై కుక్కలు ఇంకా దాడి చేస్తూనే ఉన్నాయి. బాధితులను చేరుకోవడానికి పోలీసులు ఆ ఏడు పిట్ బుల్స్‌ను కాల్చి చంపాల్సి వచ్చింది.

పోలీసులు కుక్కలను నిలువరించి, చిన్నారి వద్దకు వెళ్లేసరికే ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. "ఇది అత్యంత క్రూరమైన సంఘటన. మృతుల కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి" అని 14వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ కుక్కలు గతంలోనూ హింసాత్మకంగా ప్ర‌వ‌ర్తించాయ‌ని, ఎనిమిదేళ్లుగా తాను పెంచుకుంటున్న పిల్లిని కూడా ఇవే చంపేశాయని పొరుగున ఉన్న బ్రియన్ కిర్బీ అనే వ్యక్తి ఆరోపించారు. "అయితే, వారు కావాలని ఇలా జరగనిచ్చి ఉంటారని నేను అనుకోను. ఈ ఘటనకు వారిని నిందించడం లేదు. ఇది వారి కుటుంబం కాబట్టి మాకంటే వారే ఎక్కువ బాధలో ఉంటారు" అని కిర్బీ ఆవేదన వ్యక్తం చేశారు.
Tennessee
James Alexander Smith
Pitbull attack
dog attack
grandchild
fatal dog attack
Tullahoma
pet dogs
dog breed
US news

More Telugu News