KTR: అందుకే ఇలాంటి పరిస్థితులు: ఇండిగో సంక్షోభంపై కేటీఆర్

KTR Comments on IndiGo Crisis and Central Government
  • పైలట్లను దోపిడీ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చెప్పిందన్న కేటీఆర్
  • విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని విమర్శ
  • ఇండిగో వెనక్కి తగ్గలేదు కానీ కేంద్రం తన ఆదేశాలను ఉపసంహరించుకుందని విమర్శ
అధికారం కానీ, సంపద కానీ కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఇండిగో ఉదంతం తెలియజేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పైలట్లను దోపిడీ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం సూచించినప్పటికీ, విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. ఫలితంగానే ఇండిగో కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో ఇండిగో వెనక్కి తగ్గకపోయినా, కేంద్రం మాత్రం తన ఆదేశాలను ఉపసంహరించుకుందని కేటీఆర్ విమర్శించారు. పైలట్ల విషయంలో ఏడాది క్రితం డీజీసీఏ కొన్ని షరతులు విధించిందని ఆయన గుర్తుచేశారు. దేశంలోని విమానయాన సంస్థలు టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలని, అయితే అది నాణ్యతతో కూడుకుని ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
KTR
IndiGo
IndiGo crisis
KTR comments
BRS party
Aviation sector India
DGCA

More Telugu News