Indigo Airlines: ఇండిగో ఎఫెక్ట్... టికెట్ ధరల పెంపుపై కేంద్రం ఆగ్రహం

Indigo Flights Cancellation Leads to Airfare Hike Government Intervention
  • విమాన టికెట్ ధరలను క్రమబద్దీకరించిన కేంద్రం
  • ఎయిర్ లైన్స్ సంస్థలకు కీలక ఆదేశాలు
  • నిర్ణయించిన టికెట్ ధరలను అమలు చేయాలని సూచన
ఇండిగో విమానాల రద్దుతో ఏర్పడిన సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు అవకాశంగా మలుచుకున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. విమానయాన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ క్రమంలో, ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో టికెట్‌ ధరలను కేంద్రం క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ ఆదేశాలు పాటించాలని తెలిపింది.

చుక్కలను అంటుతున్న టికెట్ ధరలు..
ఇండిగో సర్వీసుల రద్దు కావడంతో ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. సాధారణ ధరల కంటే ఏకంగా మూడు నుంచి పది రెట్లు అధికంగా టికెట్లు విక్రయిస్తున్నాయి. ప్రధాన నగరాల మధ్య ఒక్కరోజు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం ఢిల్లీ - బెంగళూరు విమాన టికెట్ ధర రూ.1,02,000, చెన్నై - ఢిల్లీకి రూ. 90,000 లకు చేరింది. ఢిల్లీ – ముంబై టికెట్ ధర ఏకంగా రూ.54,222 పలికింది. ముంబై - శ్రీనగర్ మార్గంలో సాధారణంగా రూ.10 వేల లోపు ఉండే టికెట్ ధర, ఇప్పుడు రూ.62,000కు పెరిగింది.
Indigo Airlines
Indigo flights cancelled
flight ticket prices
aviation ministry
airfare hike
ticket price regulation
Delhi Bangalore flight
Chennai Delhi flight
Mumbai Srinagar flight
air travel

More Telugu News