Meenakshi Chaudhary: సుశాంత్ తో పెళ్లి వార్తలపై మీనాక్షి చౌదరి టీమ్ క్లారిటీ

Meenakshi Chaudhary Team Clarifies Wedding Rumors with Sushanth
  • సుశాంత్, మీనాక్షి పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం
  • పెళ్లి వార్తలను ఖండించిన మీనాక్షి టీమ్
  • ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని వెల్లడి
టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి, హీరో సుశాంత్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందంటూ గత రెండు రోజులుగా కొన్ని మీమ్ పేజీలు, సోషల్ మీడియా ఖాతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం మీనాక్షి, సుశాంత్ ఓ ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించడంతో ఈ వదంతులకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో మీనాక్షి టీమ్ అధికారికంగా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. "సుశాంత్, మీనాక్షి కేవలం మంచి స్నేహితులు మాత్రమే. వారిద్దరి మధ్య స్నేహం తప్ప మరే బంధం లేదు" అని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, మీనాక్షికి సంబంధించిన ఏ విషయమైనా తామే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. ఈ పుకార్లకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరింది.

ఇంతకుముందు కూడా ఇదే తరహా ప్రచారం జరగగా, స్వయంగా మీనాక్షి చౌదరి స్పందించి అవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. అయినప్పటికీ వదంతులు ఆగకపోవడంతో ఆమె టీమ్ మరోసారి వివరణ ఇచ్చింది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలో మీనాక్షి, సుశాంత్ కలిసి నటించారు. ఆ సినిమా సమయం నుంచి వారి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది.
Meenakshi Chaudhary
Sushanth
Meenakshi Sushanth wedding
Telugu cinema
Tollywood actors
marriage rumors
Ichata Vahanamulu Nilaparadu
celebrity news
film industry
actor clarification

More Telugu News