Munnoor Shivakumar: కొడంగల్‌లో వినూత్న ప్రచారం.. రూ.100 బాండ్‌పై ఎన్నికల మేనిఫెస్టో

Munnoor Shivakumar releases manifesto on Rs 100 bond paper in Kodangal
  • రూ.100 బాండ్ పేపర్‌పై సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల
  • హామీలు అమలు చేయకపోతే నిలదీయవచ్చని స్పష్టీకరణ
  • ఆడపిల్ల పుడితే, పెళ్లికి ఆర్థిక సాయం వంటి పలు హామీలు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ, సరికొత్త హామీలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మున్నూర్ శివకుమార్ ఏకంగా రూ.100 బాండ్ పేపర్‌పై తన మేనిఫెస్టోను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
 
గ్రామంలో వాటర్ ప్లాంట్ అభివృద్ధి, ఆడపిల్ల పుడితే రూ.2,500, పెళ్లి కానుకగా రూ.5,501, అకారణంగా మరణించిన కుటుంబాలకు పంచాయతీ నిధుల ద్వారా రూ.6 వేల ఆర్థిక సాయం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం వంటి మొత్తం 12 హామీలను ఆ బాండ్ పేపర్‌పై పొందుపరిచారు. తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ఈ హామీలను నెరవేర్చకపోతే, గ్రామస్థులు తనను నిలదీయవచ్చని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది ఆయన ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
 

Munnoor Shivakumar
Kodangal
Telangana elections
Gram Panchayat elections
Udimeshwaram
Sarpanch election
Election manifesto
Bond paper manifesto
Village development
Financial assistance

More Telugu News