Nara Lokesh: పరిశీలన తర్వాతే అనుమతులు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Permissions After Review Only for Investments
  • ఎస్‌ఐపీబీ సమావేశంలో 31 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్
  • ప్రతి కంపెనీని పూర్తిస్థాయిలో పరిశీలించాకే అనుమతివ్వాలన్న మంత్రి లోకేశ్
  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సమర్థంగా అమలు చేయాలని సూచన
  • చింతా ఎనర్జీ, రిలయన్స్ వంటి సంస్థల నుంచి భారీ పెట్టుబడులు
  • కొత్త పరిశ్రమల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు
 రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో 31 కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. పెట్టుబడులు పెట్టే ప్రతి కంపెనీని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "పరిశ్రమల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. ప్రభుత్వ, కంపెనీల సమయం వృధా కాకుండా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, పెట్టుబడులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి" అని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆమోదం పొందిన 31 కంపెనీల ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
 
ఈ సమావేశంలో మంత్రులు టీజీ భరత్, పి. నారాయణ, కందుల దుర్గేశ్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రత్యక్షంగా పాల్గొనగా, మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎస్ఐపీబీ ఆమోదించిన కంపెనీల వివరాలు

మొత్తంగా ఇప్పటి వరకు 13 సార్లు జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా 7,62,148 ఉద్యోగాలు రానున్నాయి. గురువారం జరిగిన 13వ ఎస్ఐపీబీ సమావేశంలో ఎర్లీ బర్డ్ ప్రొత్సాహకాలను అందుకోనున్న ఆరు కంపెనీలతో సహా మొత్తంగా 31 కంపెనీలకు ఆమోదం లభించింది. ఆమోదం పొందిన కంపెనీలు... పెట్టుబడులు... ఉద్యోగాల వివరాలివే...

• చింతా ఎనర్జీ- రూ.8,500 కోట్లు-5800 ఉద్యోగాలు

• గనేకో త్రీ ఎనర్జీ- రూ.2,140 కోట్లు-1000 ఉద్యోగాలు

• శ్రేష్ట రెన్యూవబుల్స్- రూ.70 కోట్లు-339 ఉద్యోగాలు

• క్యూపై ఇండియా- రూ.47 కోట్లు-9 ఉద్యోగాలు

• క్యూబైటెక్ స్మార్ట్ సొల్యూషన్స్- రూ.15 కోట్లు-30 ఉద్యోగాలు

• క్యూక్లైర్ వాయన్స్ క్వాంటం ల్యాబ్స్- రూ.14 కోట్లు-5-12 ఉద్యోగాలు

• సైబ్రా నెక్స్- రూ.10 కోట్లు-10-15 ఉద్యోగాలు

• క్యూ బీట్స్- రూ.37 కోట్లు-40 ఉద్యోగాలు

• సెనటల్లా ఏఐ థెరా ప్యూటిక్స్- రూ.6 కోట్లు-40 ఉద్యోగాలు

• ఫార్టీటూ42 టెక్నాలజీ ఇన్నోవేషన్స్- రూ.9 కోట్లు-5-8 ఉద్యోగాలు

• సిప్సా టెక్ ఇండియా- రూ.1140 కోట్లు-1251 ఉద్యోగాలు

• శ్రీ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్- రూ.62 కోట్లు -500 ఉద్యోగాలు

• ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం- రూ.30 కోట్లు-600 ఉద్యోగాలు

• నాన్రెల్ టెక్నాలజీస్- రూ.50.67 కోట్లు-567 ఉద్యోగాలు

• పీవీఆర్ హస్పటాలిటీస్- రూ.225 కోట్లు-1230 ఉద్యోగాలు

• మెగ్లాన్ లీజర్స్- రూ.348 కోట్లు-1700 ఉద్యోగాలు

• యాగంటి ఎస్టేట్స్- రూ.61 కోట్లు-250 ఉద్యోగాలు

• నాందీ హోటల్స్- రూ.150 కోట్లు-222 ఉద్యోగాలు

• రిలయెన్స్ కన్స్యూమర్ ప్రొడెక్ట్స్- రూ.1622 కోట్లు-1200 ఉద్యోగాలు

• రామాయపట్నం కార్గో రెసిప్షన్ టెర్మినల్- రూ.1615 కోట్లు-1300 ఉద్యోగాలు

• సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్- రూ.45 కోట్లు-300 ఉద్యోగాలు

• టీజీవీ ఎస్ఆర్ఏఏసీ- రూ.1,216 కోట్లు-400 ఉద్యోగాలు

• శ్రీ వెంకటేశ్వర బయోటెక్- రూ.122 కోట్లు-184 ఉద్యోగాలు

• ఎమర్జ్ గ్లాస్ ఇండస్ట్రీస్- రూ.182 కోట్లు-415 ఉద్యోగాలు

• జీయట్ ఎనర్జీస్- రూ.305 కోట్లు-300 ఉద్యోగాలు

• రామన్ సింగ్స్ గ్లోబల్ ఫుడ్ పార్క్- రూ.141 కోట్లు-600 ఉద్యోగాలు

• గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్- రూ.320 కోట్లు-700 ఉద్యోగాలు

• మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్- రూ.343 కోట్లు-355 ఉద్యోగాలు

• విరూపాక్ష ఆర్గానిక్స్- రూ.1225 కోట్లు-1500 ఉద్యోగాలు

• రాముకా గ్లోబల్ ఎకో వర్క్స్- రూ.193 కోట్లు-426 ఉద్యోగాలు

• మాస్ ఫ్యాబ్రిక్ పార్క్- రూ.200 కోట్లు-35000 ఉద్యోగాలు




Nara Lokesh
Andhra Pradesh investments
SIPB
investment promotion
job creation
Chandra Babu
AP industries
AP IT sector
Ease of Doing Business
Andhra Pradesh economy

More Telugu News